- Advertisement -
నవతెలంగాణ – కరీంనగర్
జనసేనాని, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ స్ట్రీట్‌లో అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి అభిమానులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం బాణసంచా కాల్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ ఆశయాలను, ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మనోజ్ కుమార్, మహేష్, సందీప్, హరీష్, సాయి కిరణ్, నరేష్ తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -