నవతెలంగాణ – కంఠేశ్వర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన మంగళవారం ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల చేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రజల మధ్య తేడా చూడకుండా అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి అని, అందులో భాగంగా విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీంను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా పేద కుటుంబాలకు వైద్యం అందాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి వైద్యానికి అయ్యే ఖర్చు సులభతరం చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా 108, 102, 104 అంబులెన్సులను తీసుకువచ్చి క్షతగాత్రులను నిమిషాలలో ఆసుపత్రికి తీసుకువచ్చే రవాణా వ్యవస్థను తీసుకువచ్చిన మహనీయుడు అని, రైతుల కొరకు ఉచిత 24 గంటల కరెంటును అందించిన మహనీయుడని, రైతు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కేశ వేణు అన్నారు. రాజశేఖరరెడ్డి ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన ఆలోచిస్తూ పేద ప్రజల అభివృద్ధి తన సంతోషంగా భావించి ఎల్లప్పుడూ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి అని ప్రతిపక్షాలు అని తేడా లేకుండా అందరిని సమానంగా చూసిన వ్యక్తి అని, రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రం మొత్తం కన్నీటి మయం అయ్యిందని, ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి లేరు అని మాటను జీర్ణించుకోలేకపోయారని, ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని కేశ వేణు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, జండా గుడి చైర్మన్ ప్రమోద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, బంటు బలరాం, కొండపాక రాజేష్, కు, రమేష్, పుప్పాల విజయ, ముసు పటేల్, బింగి శుభం, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ భవన్ లో వైయస్సార్ కు ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES