నవతెలంగాణ – మల్హర్ రావు
సింగరేణి కాలరీస్ అద్వ్యర్యంలో నిర్వహించిన 55వ వార్షిక సేఫ్టీ పోటీల్లో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ప్రతిష్టాకరమైన “బెస్ట్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఇన్ ఓపెన్ కాస్ట్ మైన్స్” అవార్డును గెలుచుకొన్నట్లుగా ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 31 ఆగస్టు 2025న మంచిర్యాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ఈ అవార్డును డైరెక్టర్ జనరల్ అఫ్ మైన్స్ సేఫ్టీ శ్రీ ఉజ్వల్ తహ్, సింగరేణి చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం నాయక్ చేతుల మీదుగా మైన్ ఏజెంట్ జీవకుమార్ ,మైన్ మేనేజర్ శ్రీనివాస్ ,మైన్ సేఫ్టీ ఆఫీసర్ కే సురేష్ బాబు, జెన్ ఎస్ఈ శ్రీనివాస్, మైన్ ఇంజనీర్ రాజు, వర్క్ మాన్ ఇన్స్పెక్టర్ సదానందం,రోడ్డ నరేష్ అందుకున్నట్లుగా తెలిపారు. ఇందుకు ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ,జనరల్ మేనేజర్ కేఎస్ఎన్.మూర్తి,జెన్కో జనరల్ మేనేజర్ పీ మోహన్ రావ్,ఇంజనీర్ శ్రీ కిషన్ ,సర్వే ఆఫీసర్ రవీందర్ ,సరోత్తం, వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ బాబు , మైన్ కార్మికులకు ,సూపర్ వైజర్ లకు ,అధికారులకు అభినందనలు తెలిపారు.
సేఫ్టీ పోటీల్లో అవార్డు గెలుచుకున్న తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES