- Advertisement -
పోలీసులకు ఫిర్యాదు ..
నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రంలోని మీసేవ కేంద్రం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన వ్యక్తిపై పోలీసులకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీసేవ నిర్వాహకులు శుక్రు నాయక్ ఒక ప్రకటనలు తెలిపారు. సోమవారం ఉదయం మీసేవ కేంద్రంలో ఆన్లైన్ పనులు చేసుకుంటున్న సమయంలో అవగిరి గ్రామానికి చెందిన దేశ్య గొడవపడి కంప్యూటర్ ల్యాప్టాప్ చిందర వందరం చేశాడని తెలిపారు. ఈ విషయంపై అతనిపై మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మీసేవ కేంద్రం నిర్వహణపై దాడి చేయడం పట్ల మీసేవ నిర్వాహకులు కార్యవర్గ సభ్యులు కమిటీ సభ్యులు అందరూ వచ్చి తనకు మద్దతు తెలిపినట్లు తెలిపారు.
- Advertisement -