నీలా గ్రామంలో శాంతి కమిటీ సమావేశం..
నవతెలంగాణ – రెంజల్ 
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రెంజల్ ఎస్ ఐ కే. చంద్రమోహన్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి నీలా గ్రామంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనోత్సవం పురస్కరించుకొని గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా హిందూ ముస్లిం సోదరులు కలిసి పండుగలను జరుపుకోవాలని ఆయన సూచించారు. 
శోభాయాత్రలో యువత అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. సమస్యలను సృష్టించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. శోభాయాత్రలో సంయమానం పాటించాలన్నారు. పోలీస్, రెవెన్యూ సిబ్బందికి గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఇతరులకు ఇలాంటి అసౌకర్యం కల్పించకుండా శోభాయాత్రను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాఘవేందర్, ఖలీద్, అక్తర్, రాఘవాచారి, బీపీ గంగాధర్, రఘు, గ్రామ కార్యదర్శి సాయిలు, సుల్తాన్, గ్రామ పెద్దలు, యువజన నాయకులు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
శోభయాత్రలో భక్తులు సంయమనం పాటించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

