Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ కుమ్మకు: బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ కుమ్మకు: బీఆర్ఎస్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ కుమ్మకై కాలేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు రిపోర్ట్స్ సృష్టించి సిబిఐ కి అప్పగించడం సిగ్గుచేటని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఈ డి, సిబిఐ ని తప్పు పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఏ విధంగా కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ కి అప్పచెప్పుతుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇతర ప్రాజెక్టులకు నీళ్లు చేరి నిండుకుండలా మారుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతుందన్నారు.

ప్రాజెక్టు ద్వారా పంటలు పండి రైతుల సంతోషంతో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుమ్మకై కెసిఆర్ పై నిందలు వేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యూరియా, కరెంటు కష్టాలు వస్తాయని గతంలోనే బిఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగిందని ప్రస్తుతం అదేవిధంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేణు, జ్ఞాన ప్రకాష్ రెడ్డి, గోపాల్, రామచంద్రం, హనుమంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భూమ్ రెడ్డి, ప్రభాకర్, ఆయా గ్రామాల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad