Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు 

పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం గోజెగావ్, సోనాల, గ్రామాలలో అధిక వర్షానికి లెండి వాగు అధిక ఉద్రిక్తి వలన నీట మునిగి పోయిన సోయాబీన్ పంటలను అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ క్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, తహసీల్దార్ ఎండి ముజీబ్, ఎంపిడిఓ రాణి, సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కొండ, అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, వట్నాల రమేష్, ఆయా గ్రామ ల రైతులతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. నష్టపోయిన పంటలను గ్రామాల వారిగా ఏఈవో లు సర్వే చేస్తున్నారని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుల వివరాలను సేకరించి పై అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,  గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad