Wednesday, May 7, 2025
Homeఖమ్మంసార్వత్రిక సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ..

సార్వత్రిక సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కార్మికులకు హాని తలపెట్టే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని పిట్టల అర్జున్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో గోడ ప్రతులు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులకు నిర్ణీత పని గంటలు, కనీస వేతనాలు అంటూ ఏమీ ఉండవని, యాజమాన్యాల దయ దాక్షిణ్యాలపై బ్రతకాల్సి వస్తుందని అన్నారు. కార్మిక చట్టాలను మార్చాలని, ఏ కార్మికుడు ఏ కార్మిక సంఘం సవరించాలని ప్రభుత్వానికి నివేదించకపోయినా.. కార్పొరేట్లు మెప్పు  కొరకు పట్టు పట్టి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లును తీసుకు వచ్చిందని అన్నారు. ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదానికై మున్సిపాలిటీ కార్యాలయం, వినాయకపురం,గుమ్మడివల్లి పీహెచ్సీ ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్ల సమావేశాన్ని నిర్వహించి సంబంధిత అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్ కే.నరసింహారావు, నాయకులు నాగేంద్ర, ఖాసిం, సత్యనారాయణ, రత్నకుమారి, నాగమణి, శుభాని, సుజాత, వెంకటమ్మ, లక్ష్మీ,బుజ్జమ్మ, భూషణం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -