Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ 

వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్: బీబీపేట మండల కేంద్రంలోని తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ను మండల విద్యాధికారి శ్రీ రామిని అశోక్ మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..వేసవి శిక్షణ శిబిరంలో ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, చిత్రలేఖనం, కంప్యూటర్స్ లో  పెయింట్ నేర్పించడం జరుగుతుందన్నారు. 15 రోజులపాటు ఉదయం 8 నుంచి 11:00 వరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తారనీ ప్రభుత్వ పాఠశాలలో చదివే 6 నుంచి 9 తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మూల రవీంద్రారెడ్డి  సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు  అరుంధతి, కుమారి సంధ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -