పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సీజన్ మార్పులతో శిశువు చర్మం, శరీరం ప్రభావితమవుతాయి. కాలాన్ని బట్టి బిడ్డ చర్మాన్ని రక్షించడానికి చాలా మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తాం. వేసవి, వర్షాకాలంలో శిశువు చర్మంపై అదనపు శ్రద్ధ పెట్టాలి. ఇందుకు సంబంధించి అనేక బ్రాండ్ల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
పిల్లల కోసం వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు, తల్లిదండ్రులు తరచుగా మార్కెటింగ్ వ్యూహాలకు గురవుతారు. కలర్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా కనిపించే ఉత్పత్తుల వైపు మొగ్గు చూపడం కంటే ఉత్పత్తుల లోని పదార్థాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఉత్పత్తులలో ఉపయోగించే పదార్థాలను చూసి ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
నేరుగా పిల్లలకు ఉదయంపూట సూర్య కిరణాలు తగిలితే మంచిదని చెబుతారు. అయితే చలికాలంలో కాసేపు చూపిస్తే ఏం కాదు. కానీ చాలా సేపు మాత్రం సూర్య కిరణాలు పిల్లలపై పడేలాచేయొద్దు. యూవీ రేడియేషన్ వారి లేత చర్మాన్ని తెబ్బతీసేలా చేస్తుంది. మొదటి ఆరు నెలలు సూర్య రశ్మి పడేలా చేయకుండా నివారించాలి.
మార్కెట్లో దొరికే రంగులు, సువాసనల ఉత్పత్తులను వాడకూడదు. సువాసన, కత్రిమ రంగులు శిశువు చర్మానికి చికాకు కలిగిస్తాయి. దద్దర్లు వచ్చే అవకాశం ఉంది. బిగుతుగా ఉండే దుస్తులతో పిల్లలు చిరాకు పడతారు. గాలి సరిగా తగలదు. అందుకే వారికి దుస్తులు వదులుగా ఉండేలా వేయాలి.
పిల్లల సంరక్షణ
- Advertisement -
- Advertisement -