Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్రేపు మండలంలో ఎమ్మెల్యే వేముల, ఎంపీ సురేష్ రెడ్డి పర్యటన

రేపు మండలంలో ఎమ్మెల్యే వేముల, ఎంపీ సురేష్ రెడ్డి పర్యటన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొంటారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటలకు కొనసముందర్ లో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అందించిన రూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో గోదాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు అమీర్ నగర్ డీసీ తండాలో రాజ్యసభ సభ్యులు, ఎంపీ సురేష్ రెడ్డి అందించిన రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ ( బంజారా భవన్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10గంటలకు అమీర్ నగర్ గ్రామంలో రాజ్యసభ సభ్యులు, ఎంపీ సురేష్ రెడ్డి అందించిన రూ.6లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో గోడౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఉదయం 11గంటలకు మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అందించిన రూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో  గోడౌన్  ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ఉప్లూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అందించిన రూ.5 లక్షల నిధులు, మరియు సింగిల్ విండో  నిధులు రూ.6.97 లక్షలతో కలిపి నూతనంగా నిర్మించిన సింగిల్ విండో కార్యాలయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి పాల్గొంటారని మండల అధ్యక్షులు దేవేందర్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -