Wednesday, November 5, 2025
E-PAPER
Homeఆటలుగెలుపు దిశగా హైదరాబాద్‌

గెలుపు దిశగా హైదరాబాద్‌

- Advertisement -

చెన్నై: తమిళనాడులో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీ సెమీఫైనల్‌లో హైదరాబాద్‌ గెలుపు దిశగా పయనిస్తున్నది. చెన్నైలోని గురునానక్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌.. ప్రత్యర్థి ఎదుట 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హర్యానా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 రన్స్‌ చేయగా హర్యానా 208 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 254కు ఆలౌట్‌ అయింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -