– ఆయా సంస్థలకు అద్దెకిచ్చే యోచన : ఐటీ సంస్థల ప్రతినిధులతో ఆర్టీసీ ఎమ్‌డీ సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నూతనంగా 275 ఎలక్ట్రిక్ బస్సుల్ని త్వరలో ప్రవేశపెడుతున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్ని ఆయా ఐటీ కంపెనీలకు లీజుకు ఇస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ సౌకర్యాన్ని వినియోగించు కోవాలని కోరారు. ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తున్నాయనీ, వాటికి అదనంగా త్వరలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ), అసోసియేటేడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఆఫ్ ఇండియా(అసోచామ్), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్(టీఎఫ్‌ఎమ్‌సీ) సంయుక్తంగా టెక్ మహీంద్రా క్యాంపస్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాయి. దీనికాయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఐటీ కంపెనీలకు ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్‌్ బస్సుల్ని అద్దెకు ఇచ్చే సదుపాయాన్ని కల్పించామని తెలి పారు. ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రయివేటు వాహనాల వినియోగం వల్ల ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య లు తలెత్తుతున్నాయనీ, దీని నివారణకు ప్రజా రవాణాను మెరుగు పర్చడమే పరిష్కారమని వివరించారు. ఐటీ సంస్థలు ఆ మేరకు ఉద్యోగు లకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్‌లో అందిస్తున్న రవాణా సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీసీ ఉన్నతాధి కారులు వివరించారు. ఐటీ సంస్థల ప్రతినిధులు కూడా పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. అసోచామ్ దక్షిణ ప్రాంత సెక్టార్ కో చైర్మెన్, వర్చుసా వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ఏదుల, టీఎఫ్‌ఎంసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మదాల, టెక్ మహీంద్రా హెచ్చార్డీ వినరు అగర్వాల్, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, రాజశేఖర్, సీటీఎం శ్రీదేవి పాల్గొన్నారు.
ఐటీ కారిడార్‌లో కొత్తగా 275 ఎలక్ట్రిక్ బస్సులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES