Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనాణ్యమైన వైద్యంలో రాజీపడం

నాణ్యమైన వైద్యంలో రాజీపడం

- Advertisement -

త్వరలో 6వేల పోస్టులకు నోటిఫికేషన్‌

– వైద్య కళాశాలల్లో సౌకర్యాల కల్పనకు సీఎం ఆదేశం: మంత్రి దామోదర రాజనర్సింహ
– మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీ భవనం ప్రారంభోత్సవం

నవతెలంగాణ- మహబూబాబాద్‌
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీపడేది లేదని, వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 6000 పోస్టులకు నోటిఫికేషన్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇప్పటికే ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేసినట్టు చెప్పారు. అలాగే వైద్య కళాశాలల్లో సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించి నట్టు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు, 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, బాలికలు, బాలుర హాస్టల్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి దామోదర విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకు న్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేం దుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందని చెప్పారు. అన్ని వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుం టోందన్నారు. నర్సింగ్‌ కాలేజీల ద్వారా విద్యార్థులకు ఉపాధి కోసం ఇతర దేశాల భాషలపై నైపుణ్యత కల్పించడం కోసం వినూత్న కార్యక్రమం చేపడుతున్నామ న్నారు. తద్వారా ఆర్థికంగా స్థిర పడతారని అన్నారు. అవయవాల మార్పిడి ద్వారా ఈస్టర్న్‌ తెలంగాణ హబ్‌గా మారాలని చెప్పారు. జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా మన్నారు.

రెవెన్యూ, హౌసింగ్‌, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తోందని చెప్పారు. జిల్లాకు 18 టన్నుల యూరియా వస్తుందని, ప్రతి రైతుకూ ఇబ్బంది లేకుండా అందజేసేందుకు కృషి చేస్తున్నా మని అన్నారు. కేంద్రంతో చర్చలు జరిపి మరింత యూరియా కోటాను సాధించడం కోసం మంత్రి వర్గం ఢిల్లీకి వెళ్లనుందని చెప్పారు. పంచాయతీరాజ్‌, దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయ గలమని, అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని వైద్యశాఖ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లా గిరిజన ప్రాంతం కాబట్టి అధిక నిధులు కేటా యించి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌, ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీ నాయక్‌ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌, ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్‌ వత్సల్‌ టోప్పో (రెవెన్యూ) కె.అనిల్‌ కుమార్‌, డిఎంఈ డాక్టర్‌ కె.నరేంద్ర కుమార్‌, ఎన్‌ఎంసీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ విమల తమస్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లకావత్‌ వెంకట్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మంత్రుల కాన్వారు ముందు బీఆర్‌ఎస్‌ నిరసన
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోందంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రుల కాన్వారుని అడ్డుకునేందుకు యత్నించారు. కురవి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై భారీ రాస్తా రోకో నిర్వహించారు. డీఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులను పక్కకు నెట్టేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad