Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగిరిజన హాస్టళ్ల డైలీవేజ్‌ వర్కర్ల జేఏసీ నూతన కన్వీనర్లు ఎన్నిక

గిరిజన హాస్టళ్ల డైలీవేజ్‌ వర్కర్ల జేఏసీ నూతన కన్వీనర్లు ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్‌ వర్కర్ల యూనియన్ల జేఏసీ కన్వీనర్లుగా మాడే పాపారావు, బి.మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్‌ డైలీవేజ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం), తెలంగాణ గిరిజన స్కూల్స్‌, హాస్టల్స్‌ డైలీవేజ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (స్వతంత్ర సంఘం) కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. ప్రతి జిల్లా నుంచి సంఘానికి ఒక్కరు చొప్పున రాష్ట్ర జేఏసీలో సభ్యులు ఉండాలని నిర్ణయించాయి. వేతనాల తగ్గింపును అడ్డుకోవాలనీ, పర్మినెంట్‌ సాధించుకోవాలనీ, ఉద్యోగ భద్రత సాధించుకునేందుకు పోరాటాలను తీవ్రతరం చేయాలని తీర్మానించాయి. టీజీటీడబ్ల్యూహెచ్‌డీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కె. బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెండు సంఘాల నాయకులు బి. నాగేశ్వరరావు, సురేందర్‌, హీరాలాల్‌, అనంత రాములు, మంగీలాల్‌, నరసింహ, రవి, కౌసల్య, రాములు, శ్యామ్‌ రామ్‌, సంగ్య నాయక్‌, కౌసల్య, భరత్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం
హైదరాబాద్‌లో టీజీటీడబ్ల్యూహెచ్‌డీడబ్ల్యూ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్‌ డిమాండ్ల పత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. అనంతరం జేఏసీ కన్వీనర్లు బి.మధు, మాడే పాపారావు మాట్లాడుతూ..కొంతమంది డైలీవేజ్‌ వర్కర్లకు ట్కెం స్కేల్‌ అమలు చేస్తున్నారనీ, మరి కొంతమందికి జిల్లా కలెక్టర్‌ గెజిట్‌ ప్రకారం వస్తున్న వేతనాలను తగ్గిస్తూ జీవో 64 అమలు చేస్తున్నారని వాపోయారు. ఈ ద్వంద విధానాల వల్ల డైలీవేజ్‌ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు తగ్గిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆరు నెలల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 12 నెలల కాలానికి పూర్తి వేతనాన్ని చెల్లించాలని విన్నవించారు. 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయకపోవడం దారుణమన్నారు. మరణించిన డైలీవేజ్‌ వర్కర్ల స్థానం లో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలనీ, రూ.10 లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల రిటైర్డ్‌ బెనిఫిట్స్‌, అంత్యక్రియల ఖర్చు రూ.50 వేల చెల్లింపు వంటి వాటిని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. వారాంతపు సెలవులు ఇవ్వాలనీ, రెండు జతల యూనిఫామ్‌ బట్టలతోపాటు గుర్తింపు కార్డులివ్వాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad