Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమాజీ సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

మాజీ సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

- Advertisement -

– బీజేపీ ఎమ్మెల్యేలు రామారావు పటేల్‌, డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ.670 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు రామారావు పటేల్‌, డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ లో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్‌ ఆధ్వర్యంలో జేఏసీ బృందం బీజేపీ ఎమ్మెల్యేలకు వినతిపత్రాన్ని అందజేశారు. తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా రామారావు పటేల్‌, డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ…ప్రభుత్వమనేది నిరంతర ప్రక్రియ అనీ, మాజీ సర్పంచులకు పార్టీలను ఆపాదించడం అన్యాయమని తెలిపారు. సర్పంచులెవరైనా బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులకు కూడా రాష్ట్ర సర్కారు రూ.150 కోట్ల విలువైన పనులు చేయించి బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, 15వ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఎస్డీఎఫ్‌ నిధులను నిలిపేసిందని ఎత్తిచూపారు. పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా కొనలేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్‌ రెడ్డి కార్యదర్శి వేడబోయిన గణేష్‌, బీరప్ప, మన్నే పద్మారెడ్డి పూర్ణచందర్‌ గౌడ్‌, అరవింద్‌ రెడ్డి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad