Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్కోరట్ పల్లి గ్రామ అభివృద్దికి కృషిచేస్తా: ఎమ్మెల్మే

కోరట్ పల్లి గ్రామ అభివృద్దికి కృషిచేస్తా: ఎమ్మెల్మే

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి: మండలంలోని కోరట్ పల్లి గ్రామ అభివృద్ది కి నీదులను కేటాయించి అబివృద్ధి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ జాహుర్, గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి అద్వర్యంలో విడిసి సభ్యులు ఎమ్మెల్యే ను కలిసి శాలువాతో సత్కరించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో నేలకోని ఉన్న సమస్యలను వివరిస్తూ నీదులను మంజూరు చేయాలని విన్నవించారు.గ్రామబివృద్ది కోసం ఇంతకు ముందు కూడా నీదులను మంజూరు చేశానని, ఇకముందు కూడా ప్రత్యేక దృష్టి తో మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.హైమస్ లైట్లు,స్మషన వాటికి వద్ద నీటి కుండిలను ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే వివరించారు. తమ సమస్యల్ని విని సానుకూలంగా స్పందించడంతో వీటికి సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.కలిసిన వారిలో విడిసి సభ్యులు  ప్రమోద్, గంగాధర్, అజీం, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, గంగాధర్, మోహన్, ప్రభాకర్ తోపాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -