Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణహిత నిమజ్జన వేడుకలు నిర్వహించాలి: ఎస్సై అభిలాష్‌

పర్యావరణహిత నిమజ్జన వేడుకలు నిర్వహించాలి: ఎస్సై అభిలాష్‌

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
గణేష్‌ నిమజ్జన వేడుకలను మండపాల నిర్వాహకులు పర్యావరణహితంగా నిర్వహించాలని ఎస్సై అభిలాష్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ బి. అనురాధ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో తీసుకొని మండల పరిధిలో డీజెలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. డీజేల వలన శబ్ధ కాలుష్యం పెరిగి విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. వయస్సుపైబడిన వారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఎవరైనా డీజేలు పెడితె సీజ్‌ చేసి వారిపై చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. డిజేలకు స్వస్తి చెప్పి మన సాంప్రదాయ పద్దతిలో పండుగలు జరుపుకోవాలని, కోలాటం, బ్యాండ్‌, డప్పులతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలకు శాంతిభద్రతను కల్పించడంలో పోలీస్‌ శాఖ 24 గంటలు పనిచేస్తుందని, నిమజ్జనం వరకు సహకరించాలని మండప నిర్వాహకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా తగిన ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా అత్యవసరం అనిపిస్తే స్థానిక పోలీస్‌  లేదా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 100కు కాల్‌ చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -