Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ యువ వికాసం అమలుపై బ్యాంకర్ల సమావేశాలు

రాజీవ్ యువ వికాసం అమలుపై బ్యాంకర్ల సమావేశాలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక మరియు బ్యాంకు లింకేజ్ ప్రక్రియలను సమీక్షించేందుకు జిల్లాలోని వివిధ మండలాలలో మండల స్థాయి బ్యాంకర్ల సమితి  సమావేశాలు నిర్వహించగా, పథకం జిల్లా సమన్వయకర్త నాగిరెడ్డి హాజరై,  మాట్లాడారు.  పథకం మార్గదర్శకాలను వివరించి, ఎంపిక ప్రక్రియలో మండల అభివృద్ధి అధికారులు , బ్యాంక్ మేనేజర్లు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.  దరఖాస్తులను పూర్తిస్థాయిలో యం.పి.డీ.ఓ.లు , మున్సిపల్ కమీషనర్లు డెస్క్ వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు. మే 10వ తేదీ నాటికి తాత్కాలిక లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్‌సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  జినుకల శ్యామ్ సుందర్  బ్యాంకులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పని చేసి, బ్యాంకులకు పంపిన జాబితాలను పరిశీలన చేసి, దినసరి పరిశీలన పురోగతిని ఎంపీడీవోల ద్వారా ప్రధాన కార్యాలయానికి అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భువనగిరి, బిబినగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, తుర్కపల్లి, ఆలేరు, మోటకొండూర్, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల ఎంపీడీవో లు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా బీసీ , మైనారిటీ సంక్షేమ అధికారి  యాదయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్  కె శివరామకృష్ణ బ్రాంచ్ మేనేజర్లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -