Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్కార్మికుల హక్కుల కోసం పోరాడాలి..

కార్మికుల హక్కుల కోసం పోరాడాలి..

- Advertisement -

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి 
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
: కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితమై పోరాడాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ లోని కార్మిక భవనంలో సీపీఐ పట్టణ మహాసభలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రమకు తగిన ఫలితం దక్కాలని 1885లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఐక్యం గా పోరాటం చేశారన్నారు. ఈ పోరాటంలో ఏడుగురు కార్మికులు మరణించారని, వారి పోరాటం నుండి పుట్టింది ఎర్రజెండా అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం లేకపోతే నైజాం గద్దె దిగే వాడే కాదని, అలాంటి పోరాటంలో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ఉండడం గర్వకారణం అన్నారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రజల బతుకులు మారడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11ఏండ్లు గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ని పెంచి పోషిస్తూ హిందూ దేశమని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చేందుకు బిజెపి ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని, వారిపై దాడులు అరికట్టాలన్నారు. ప్రహల్గాం ఘటన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిందని, దీనికి బాధ్యత వహించాలన్నారు. ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి, కార్యవర్గ సభ్యులు కడారి రాములు,మీసం లక్ష్మణ్, అనసూర్య, కుర్ర రాకేష్, కేవి అనసూయ, అజ్జ వేణు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad