వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ – రాయపర్తి: వర్ష భావం వాతావరణం ఏర్పడుతున్నందున వరి ధాన్యం కాంటాలను త్వరగతిన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకెపి, పీఎస్సీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాంటాలైన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి నిలువ చేసిన సమయంలో వర్షాలు పడడం బాధాకరమన్నారు. రైతులు టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు టోకెన్ ప్రకారం త్వరగా కాంటాలు పెట్టి పూర్తి చేయాలన్నారు. రైతులు ధాన్యం రాసులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆమెతో పాటు డిసిఓ నీరజ, సివిల్ సప్లై డిఎం సంధ్యారాణి, తహశీల్దార్ శ్రీనివాస్, పీఎస్సీఎస్ చైర్మైన్ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
వరిధాన్యం కాంటాలను త్వరగతిన పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES