Wednesday, May 7, 2025
Homeబీజినెస్2032 నాటికి 12.3 కోట్ల ఇవి వాహనాలు

2032 నాటికి 12.3 కోట్ల ఇవి వాహనాలు

- Advertisement -

– చార్జింగ్‌ స్టేషన్లకు భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ : వచ్చే 2032 నాటికి భారత రోడ్లపై 12.3 కోట్ల విద్యుత్‌ వాహనాలు ఉండొచ్చని ఓ సంస్థ అంచనా వేసింది. ఇవి విప్లవానికి భారత్‌ సిద్దమవుతోం దని ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయన్స్‌, కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ సయుక్తంగా ఓ రిపోర్టులో తెలిపాయి. ఆ వివరాలు.. ఇప్పటికీ ద్విచక్ర, త్రిచక్ర ఇవిల వినియోగం పెరుగుతోంది. ఈ రంగం మరింత విస్తరించడానికి చార్జింగ్‌ మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు అవసరమని తెలిపింది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి ఈవీలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. విద్యుత్‌ వాహన రంగం వృద్ధికి ఫేమ్‌-2 పథకం మద్దతునిస్తుంది. ఇది ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు డిమాండ్‌ ప్రోత్సాహకాలను అందిస్తుంది. అదే విధంగా పబ్లిక్‌ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలకు మూలధన సబ్సిడీలకు మద్దతునిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -