Wednesday, May 7, 2025
Homeజాతీయంరోడ్డు ప్రమాద బాధితులకు

రోడ్డు ప్రమాద బాధితులకు

- Advertisement -

రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకు ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’గా నామకరణం చేసింది. మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద ఆస్పత్రుల్లో రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులవుతారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజులదాకా ఈ సేవలు పొందవచ్చు. రోగులకు ట్రామా, పాలీట్రామా సేవ లు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆస3్పత్రులనూ ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లో సూచించింది. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తెచ్చి న వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ తమవద్ద సౌక ర్యాలు లేకపోతే వెంటనే మరో ఆస్పత్రికి పంపాల్సి ఉంటుంది. అందుకోసం సదరు ఆస్పత్రివారే రవాణా సౌకర్యాలు కల్పించాలి. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆస్పత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -