‘రజనీకాంత్‌కి ‘మిరాయ్’ ట్రైలర్ చూపించాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇలాగే కంటిన్యూ చెరు, గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని బాగా ఎంకరేజ్ చేశారు. మంచి ఎనర్జీ ఇచ్చారు’ అని కథానాయకుడు మంచు మనోజ్ చెప్పారు.
హీరో తేజ సజ్జా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. మనోజ్ మంచు ప్రతినాయకుడిగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మనోజ్ మంచు గురువారం మీడియాతో సినిమా విశేషాలు షేర్ చేసుకున్నారు.
మా గేమింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు ఓ రోజు తేజ వచ్చి ‘మిరాయ్’ గురించి చెప్పాడు. దర్శకుడు కార్తిక్ చెప్పిన కథ చాలా నచ్చింది. శ్రీరాముల వారి నేపథ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్‌డ్రాప్, ఇతిహాసాల కోణం చాలా అద్భుతంగా అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. లేజీగా ఉంటూ బతకకూడదనే క్యారెక్టర్ నాది. దీన్ని కార్తిక్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన తనకి రుణపడి ఉంటాను.
తను గ్రేట్ టెక్నీషియన్. ఇదే కంటెంట్‌ని మరో డైరెక్టర్ చేస్తే మాత్రం ఈ బడ్జెట్‌లో అవ్వదు. తన అనుభవంతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను.
ఈ సినిమాలోని యాక్షన్ కోసం జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ఇది నా కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. తేజ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. యాక్షన్‌ని ఇంటెన్స్‌గా ప్రాక్టీస్ చేశాడు. మా నిర్మాత విశ్వప్రసాద్ విజన్‌ని అప్రిషియేట్ చేయాలి. చాలా గ్రాండ్ స్కేల్‌లో సినిమా తీశారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.
దాదాపుగా అన్ని లైవ్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. రియల్ లొకేషన్స్‌లో గ్రాఫిక్స్‌ని వాడి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని మరింతగా ఎన్‌హాన్స్ చేశాం. ఇందులో యాక్షన్స్ అంతా లైవ్‌గా ఉంటుంది.
నా లైఫ్‌లో హైయస్ట్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ ఇది. కెరీర్ ప్రారంభంలో ‘మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా?’ సినిమాలకు కూడా చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ స్కేల్‌లో సినిమా రావడం, ప్రపంచంలో నలుమూలల నుంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది.
ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి, రక్షక్’ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు కూడా హై ఇంటెన్సీటీ యాక్షన్ ఉన్న సినిమాలు. తమిళం నుంచి కూడా కొన్ని కథలు వస్తున్నాయి. ఒక నటుడిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ఉంది. ‘అహం బ్రహ్మాస్మి’ సమయం వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. అలాగే ‘వాట్ ద ఫిష్’ సినిమా కూడా చేయాలి.
‘మిరాయ్’లో చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశా
- Advertisement -
- Advertisement -