– లబ్ధిదారులే ఫోటోలను అప్‌లోడ్ చేసుకునే అవకాశం
– గృహనిర్మాణ కార్పొరేషన్ ఎమ్‌డీ వీపీ గౌతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు కొత్త ‘యాప్’ తీసుకొచ్చామని గృహనిర్మాణ కార్పొరేషన్ ఎమ్‌డీ వీపీ గౌతం చెప్పారకు. తమ ఇండ్ల పురోగతికి సంబంధించిన వివరాలను లబ్ధిదారులే స్వయంగా ఫోటోలను అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. తద్వారా సకాలంలో బిల్లులు పొందే అవకాశం ఉందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్ణీత సమయంలో లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసేందుకు యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ వినియోగంపై సమగ్రమైన అవగాహన కల్పించాలని సూచించారు. లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు, ఇంతవరకు చేసిన చెల్లింపుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. ఆ విషయాలను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకునే విధంగా యూనివర్సల్ సెర్చ్ అవకాశాన్ని కల్పించడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంటి నిర్మాణపు పనులు బిల్లుల దశకు వచ్చిన 15 రోజుల్లో నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చినట్టు చెప్పారు.
విస్తృత సేవలతో ఇందిరమ్మ ఇండ్ల ‘యాప్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES