సమాజ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి
అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్పది: సిఐ నాగబాబు
నవతెలంగాణ – మణుగూరు
యువత సమాజం పట్ల చైతన్యవంతంగా ఉండాలని, వస్తున్న మార్పు కనుగుణంగా పరిణామం చెందాలని మణుగూరు సీఐ పి నాగబాబు అన్నారు. శుక్రవారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పైలట్ కాలనీ ఎక్సలెంట్ స్కూల్ వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో వైభవంగా మహా గణపతి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని మణుగూరు సిఐ నాగబాబు ప్రారంభించారు. సుమారు 800 మందికి పైగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత రానున్న కాలంలో కూడా ఇలా ఎంతో ఐక్యంగా ముందుండాలని ప్రతిదానిలో కూడా యువత చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. యువత వారి భవిష్యత్తుపై ముందడుగు వేసి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. అనంతరం కమిటీ సభ్యులు సి ఐ నాగబాబుని శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో మామిడి జేమ్స్ రాపర్తి శ్రీహరి మరియు కమిటీ సభ్యులు కంపాటి రవి దొరబాబు హేమంత్ గడ్డం పవన్ కుమార్ శివ సాయి మరియు స్థానిక యువకులు మహిళలు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు పాల్గొన్నారు.
యువత చైతన్యవంతంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES