Wednesday, May 7, 2025
Homeక్రైమ్వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి

వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి

- Advertisement -

నవతెలంగాణ -కోడేరు/మునుగోడు
వడదెబ్బకు గురై ఇద్దరు ఉపాధి హామీ కూలీలు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటనలు నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల్లో జరిగాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన ఎర్రమోని నాగయ్య (55). శనివారం ఉపాధి హామీ పనికి వెళ్లాక అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన గుర్రం యాదయ్య(51) రోజు మాదిరిగానే సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం పని ప్రదేశంలోనే అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే చెట్టు కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని నల్లగొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -