అంత్యక్రియల్లో పాల్గొన్న సోలిపేట సుజాత రామలింగారెడ్డి 

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ అశోక్ రెడ్డి తల్లి లక్ష్మీ బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రామలింగారెడ్డి లక్ష్మీ కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆకారం ఎంపీటీసీ లక్ష్మీ నారగౌడ్, సర్పంచ్ నాగభూషణం, ఉప సర్పంచ్ మహేష్ గౌడ్,మాజీ అత్మకమిటి చైర్మన్ సంజీవ రెడ్డి, పార్టీ నాయకులు సత్తిరెడ్డి,నాగి రెడ్డి, నర్సింలు, నందయ్య, కొట్టే ఇంద్ర ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love