– జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స రక్తలేమితో చికిత్స పొందుతున్న కాచాపూర్ గ్రామానికి చెందిన జయ రాములు అనే పేషెంట్ కు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితిని సంప్రదించారు. ఒక్క ఫోన్ చేయగానే కామారెడ్డికి చెందిన ఆర్ కే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ లింగం సహకారంతో వారికీ కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సవం రోజు రక్తం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. విద్య నేర్పుతూ విద్యార్థుల జీవితాలు బాగుపరిచే ఉపాధ్యాయులు ఇలా రక్తం ఇస్తూ.. పేషెంట్ల కుటుంబాల జీవితాలు బాగుపడేట్టు చేస్తున్నారన్నారు. రక్తదాతకు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ మోహన్, బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రోజు రక్తదానం చేసిన ఉపాధ్యయుడు (లెక్చరర్)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES