Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో ఉత్తమ స్థానంలో నిలపాలి: ఎమ్మెల్యే కుంభం

జిల్లాలో ఉత్తమ స్థానంలో నిలపాలి: ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాను ఉత్తమ స్థానంలో నిలపాలనీ, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ సమావేశం మందిరంలో  ఉపాధ్యాయుల దినోత్సవం , దిగంవత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల, విద్యారంగా నికి సంక్షేమానికి  పెద్ద పీట వేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. సమాజంలో పవిత్రమైన స్థానం ఉపాధ్యాయులదని ఆయన కొనియాడారు.

 జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత గురువులపై ఉందని, అలాంటి గురువులు సమాజంలో గొప్పవారని అన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి,జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టాలని అన్నారు.  టీచర్లు చాలా అద్భుతంగా పాఠాలు విద్యార్థులకు బోధిస్తున్నారు అన్నారు  పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో 7వ స్థానం సాధించడంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కృషిని అభినందనీయమన్నారు.ఈ సంవత్సరం మొదటి మూడు స్థానాల లోపు ఉండేలా ప్రయత్నం చేయాలని కోరారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ సమాజంలో పవిత్రమైన స్థానం ఉపాధ్యాయులదని ఆయన కొనియాడారు. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందుతున్న వారి బాధ్యత మరింత పెరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  అన్నారు.జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు క్రమశిక్షణతో, అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. 

అనంతరం 50 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలు,మెమెంటో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీ జె ఏ సీ ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి,జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, విద్యా శాఖ ఏ.డి.ఎన్.ప్రశాంత్ రెడ్డి,సెక్టోరియల్ అధికారులు,మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad