Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలు18వ వార్డులో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సర్వే 

18వ వార్డులో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సర్వే 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి పట్టణ కేంద్రంలోని 18 వ వార్డు గాంధీనగర్లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు శుక్రవారం సర్వే చేపట్టారు. ఈ సర్వేలో జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, టౌన్ కార్యదర్శి పరమేశ్వర చారి మాట్లాడుతూ.. కొన్ని గల్లీలలో మిషన్ భగీరథ నీళ్ల కోసం రోడ్లు తవ్విసరిగా వేయనందున రోడ్లు వేయాలన్నారు. డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉన్నందున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల కోటాను పెంచి నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు. చాలామంది శిథిలావస్థలో ఉండే ఇళ్లలో నివసిస్తున్నందున వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నారు.

మున్సిపల్ అధికారుల 100 రోజుల కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ ఏరియాలో ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు, డ్రైనేజీ, చెత్త ఎక్కడికక్కడే ఉన్నందున దోమల బెడద విపరీతంగా పెరుగుతోందని కాలనీవాసులు చెబుతున్నారని తెలిపారు. పిల్లలకు పెద్దలకు జ్వరాలు వచ్చి అవస్థలు పడుతున్నారన్నారు. మేస్తిరి పుల్లయ్య ఇంటిదగ్గర కరెంట్ పోల్ శిథిలావస్తులు ఉన్నందున కొత్తపోలు వేయాలని ఏ ఈ దగ్గర మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాముడు కిరాణం దగ్గర మంచినీటి పైప్లైన్ లీకై వృధాగా పోతున్నందున సరిచేయాలన్నారు. ఇక్కడ ఉండే సమస్యలపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు శాఖ కార్యదర్శి జి మదన్, రాబర్ట్, రత్నయ్య, రాములు ,నరసింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad