చట్టసభలంటేనే ప్రజాస్వామ్యానికి పునాదులు. ప్రజా క్షేమానికి చట్టాలు రూపొందించే కేంద్రాలు.ఇంతటి బాధ్యత గల సభల్లో సగం మంది నేర చరితులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. దేశంలో దాదాపు నలభై ఏడు శాతం మంది మంత్రులు నేరారోపణలు ఎదుర్కొం టున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా నివేదికలో పేర్కొంది. ఇది ప్రజాస్వామిక వాదులందరినీ కలవర పెడుతున్నది. ఎందుకంటే, ఈ పదకొండేండ్ల కాలంలో జరుగుతున్న పరి ణామాల్ని దేశమంతా గమనిస్తూనే ఉన్నది. నేరాలు, ఘోరాలు పెరగడం, హత్యలు, లైంగికదాడులు పెచ్చుమీరడం మనిషి భద్రతను ప్రశ్నా ర్థకం చేస్తున్నది. వీటిని అరికట్టడంలో పాలకాగణం అడుగడుగునా వైఫల్యం చెందుతోంది. ప్రజలేవారి భద్రత కోసం రోడ్లెక్కి నినదిస్తున్న దుస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారూ నేరాల్లో భాగస్వాములుగా ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భగ్యం ఏముంటుంది? వారు ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించగలరా? ఏలి కలంతా ఏదో ఓకేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్నారంటే ఈనేర సంస్కృతికి వారే ఆజ్యం పోస్తున్నట్టు కాదా?
ఏడిఆర్ నివేదిక అనేక విస్తుపోయే విష యాలను వెల్లడించింది. ఇరవై ఏడు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రమంత్రి మండలి నుంచి 643 మంది అఫిడవిట్లను పరిశీలించింది.ఇందులో చాలావరకు హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై అఘాయిత్యాలవంటి అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మం త్రులున్నారు. ఇది సిగ్గుచేటు. తెల్లారితే చాలు, మైకు పట్టుకుని మహిళలకు రక్షణగా ఉంటామని, వారి క్షేమమే ధ్యేయమని నీతులు వళ్లించే నేతలు దీనికి సమాధానం చెప్పాలి. పాలక పార్టీల నేతల్లో చాలామంది ఏదో ఓ కేసులో నిందితులుగా ఉన్న వారే. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కూటమిది ఈ నేరాల్లో సింహభాగం. 336 మంత్రుల్లో 136 మందిపై క్రిమినల్ కేసులు నమోదవ్వడం దేశాన్నే నివ్వెర పరుస్తున్నది. దీన్ని బట్టి చూస్తే అవినీతి, బంధుప్రీతి, రాగద్వేషాల కతీతంగా పనిచేస్తామని నమ్మబలికిన నాయకులు అధికారాన్ని చెరబట్ట గానే నేరాల్లో పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది.
ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే తీవ్రనేరారో పణలపై ప్రధాని సహా, ముఖ్య మంత్రి, మంత్రి, ప్రజా ప్రతినిధు లెవరైనా 30 రోజులు కస్టడీలో ఉన్నా వారు పదవిని కోల్పోయేలా కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో మూడు బిల్లులను సవరణకు పెట్టింది. ఇది చట్టమైతే నేరం నిర్ధారించబడకున్నా ఎవరైనా అక్కసుతో ఒక్క నెల రోజులు బయటకు రాకుండా ప్రజా ప్రతినిధిని జైళ్లో నిర్భందిస్తే చాలు, పదవి పోవాల్సిందే. బీజేపీయేతర రాష్ట్రాల నేతల్ని కేసుల్లో ఇరికించి ప్రభుత్వాలను పడగొట్టే కుట్రలో భాగంగానే ఈ చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శించాయి, ఆందోళన కూడా చేశాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఇప్పటివరకు ప్రజాస్వామ్య బద్ధంగా, పార దర్శకంగా ఎన్నికైన రాష్ట్రాల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన చరిత్ర బీజేపీది. ఈ ‘పదవీచ్యుత’ చట్టం దాన్ని మరింత బలోపేతం చేస్తుంది. నేరస్తులుగా నిర్ధారించబడినవారు, అధికారాన్నే అడ్డుగోడగా నిర్మించు కున్నవారు కాషాయ పార్టీలోనే ఎక్కువ! మరి వారందరినీ పదవినుంచి తొలగించాలి. పైగా ఈడి, సిబిఐ పేరుతో ఇతర పార్టీల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ ‘వాషింగ్ మిషన్’లో శుభ్ర పరుస్తున్నారు, వారి కేసులు రద్దుచేస్తున్నారు, అందలమెక్కిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే.
ఇంకా బీజేపీలో పద్నాలుగు మంది బిలియనీర్లయిన మంత్రులు ఉన్నారని ఏడీఆర్ చెబుతున్నది.ఈ డబ్బంతా అక్రమ సంపాదనే కదా! ఎంతోమంది నిర్దోషులను దోషు లుగా చిత్రీకరిస్తే వచ్చినది. పారదర్శకంగా ఉండాల్సిన పదవి అవినీతిమయం కావడం, నిస్వార్థం స్థానంలో స్వార్థ ప్రయోజనం చేరడంతో వచ్చిన ఫలితమిది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కట్టిన బ్రిడ్జిలన్నీ చాలా వరకు నాణ్యతలేమి కారణంగా కూలి పోయాయి. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. దీనికి బాధ్యత కాంట్రాక్టర్లతో పాటు, వాటికి అనుమతినిచ్చిన శాఖలు, వాటి అమలుకు సంతకాలు పెట్టిన మంత్రులది. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజల్లో విద్వేషాలు రెచ్చ గొట్టడం, వారిపై దాడులకు ఉసిగొల్పడం, తద్వారా వారి చా వులకు కారణమవ్వడం కూడా క్షమించరాని నేరం. దేశంలో నేర సామ్రాజ్యం విస్తరించడానికి పాలకులు అను సరించే విధానాలూ కారణమే. వాటిని అరికట్టాలంటే జైళ్లు, శిక్షలు సరిపోవు. చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నా అందులో చిన్న లొసుగు ద్వారా కూడా బయటపడే అవకాశముంటుంది. అందుకని ప్రజలు నేరచరితుల పట్ల అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం.
పాలకులే నేరస్తులైతే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES