Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅఫ్ఘన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు

అఫ్ఘన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు

- Advertisement -

కాబూల్‌ : అఫ్ఘనిస్తాన్‌ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సరిగ్గా నాలుగైదురోజుల కిందటే 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుకి రెండువేల మందికిపైగా మృతి చెందారు. ఆదివారం రాత్రి సంభవించిన ఈ భూకంప ఘటనను మరువకముందే శుక్రవారం తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. అఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం ఉదయం 4.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. వెడల్పు : 34.57, పొడవు : 70.42, 120 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad