- Advertisement -
- రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చ
- తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ శుక్రవారం రోజున రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో అభివద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటనీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్‌సిటీగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణా రాష్ట్ర విశిష్టతను మంత్రి ఉత్తమ్ ఆయనకు వివరించారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధునిక వసతులు, ఫార్మా రంగంలో పురోగతిని ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు తరలి వస్తున్నారనీ, డెన్మార్క్ లాంటి దేశం కుడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -