నవతెలంగాణ-హైదరాబాద్ : లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు..కల్వకుంట్ల కవిత పేరు ఎత్తకుండానే మాట్లాడారు. హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను కలవనున్నారు. దీంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై హరీష్ ఎలా స్పందింస్తారని పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తి నెలకొంది.
అయితే… విమానాశ్రయం దగ్గర మాత్రం మీడియాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని… తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు అని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉందని వివరించారు హరీష్ రావు. నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా…. నాపై, పార్టీపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు.