Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శ్రీ సిద్ధి వినాయక మండపం ఆధ్వర్యంలో వేలం..

శ్రీ సిద్ధి వినాయక మండపం ఆధ్వర్యంలో వేలం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పడంపల్లి గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఆధ్వర్యంలో వినాయకునికి సంబంధించిన పూజా సామాగ్రితో పాటు లడ్డు, సేపు, మెడలోని హారాలు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ లక్ష్మీదేవి మందిరం ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. మొదట వేలం పాటలు నిర్వహించగా గ్రామస్తులు నువ్వా నేనా అంటూ భారీగా వేలంపాటలో పాల్గొని ఒకరిని మించి ఒకరు వేలం పాటలో వినాయకునికి సంబంధించిన లడ్డు సెట్లు దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా పలువురు వివిధ రకాలైన వస్తువులను వేలం పాటలో దక్కించుకొని అంతం చేసుకున్నారు. వేలంపాట ఈ ఏడాదికి గాను 1, 01,851/- రూపాయలు ఈ సిద్ధి వినాయక మండపానికి నిర్వహించిన వేలం పాటలో  లభించిందని నిర్వాహకులు హెచ్ . మహేష్ , ఎల్ . శ్రీకాంత్, హెచ్,  మన్మత్, పీ. వికాస్, పీ. నిఖిల్, ప్రశాంత్ పటేల్, మొండుకార్ మల్లికార్జున్, మాజీ సర్పంచ్ పావుడే రమేష్ , పావుడే బస్వంత్ (శీను). లక్షెట్టి మాధవరావు, పావుడే గణపతి, సన్నీ, రాజేష్ , మాజీ సర్పంచ్ గణేష్ పటేల్, వినాయక్, సిహెచ్. మల్లికార్జున్, హన్మగొండ, బిరాదార్ చంద్రకాంత్, పీ. బద్రు , హెచ్ . ప్రభు,  మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, బి. సురేష్ లక్షట్టి సుధాకర్, మొండకార్ బాలాజీ, టీచర్ గంగయ్య అప్ప, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad