Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి  నిజామాబాదు నగరంలోని డాక్టర్ దేవిదాస్ భవన్ లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిద ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 74 మంది ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు దీకొండ యాదగిరి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరవరానిదన్నారు.

నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి,వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,ఉపాద్యక్షులు పెండ్యాల జీవన్,సహాయ కార్యదర్శి మెరుగు లక్ష్మినారాయణ,నిర్వహణ అద్యక్షులు పిట్ల గణేష్,కార్యదర్శి చింతల గంగాదాస్,చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బింగి ధరంవీర్,జిల్లా కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad