నవతెలంగాణ – హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కీలకమైన అధికారిక పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన ఆయన, శ్రీశైలం పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పోలీస్ అకాడమీలో స్థానిక సీబీఐ అధికారులతో సమీక్షా సమావేశంతో పాటు, కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల దర్యాప్తు పురోగతిపై కూడా ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో, వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చేరడంతో, నేడు జరగాల్సిన అధికారిక సమావేశాలపై అనిశ్చితి నెలకొంది.
అస్వస్థతకు గురైన సీబీఐ డైరెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES