– సభ ఏర్పాట్లపై సమావేశమైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారు
– రేపు కామారెడ్డి లో ముఖ్య కార్యకర్తల ఉమావేశం
నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 15 న కామారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు పై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ( హైదరాబాద్లోని ) నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మంత్రి సీతక్క, సమావేశమయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి వేదికగా అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకునీ సంబరాలు చేసుకుంటూ ఏర్పాటు చేసే పై సమీక్ష నిర్వహించుకున్నారు.
నేడు 7-9-25 నాడు కామారెడ్డి పట్టణంలో ఇన్చార్జి మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డి పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి శాసనసభ సమావేశాల్లో బిల్లు పై ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సోదరులు ఆశలు నెరవేరుస్తూ ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకుంది. నాడు కులగనన సర్వే జరుగుతుంటే, బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తమ వివరాలు ఇవ్వద్దని బహిరంగంగా పిలుపునిచ్చారు. వివరాలను ఎలా ఇస్తాం? ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తాం? అంటూ మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకులు ప్రజలను మిస్‌లీడ్ చేశారు..
రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు పిలిచి మరి బహిరంగ సభ పెట్టి సంబరాలు జరుపుకుంటాం అని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అన్నారు.