నవతెలంగాణ – అచ్చంపేట
యూరియా కొరతలు నివారించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సైదులు మాట్లాడారు. రైతు గోస విని.. సరిపడా యూరియా పంపిణీ చేయాలన్నారు. యూరియా అందించడంలో పాలకవర్గాలు విఫలం చెందాయని అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకొని రైతులకు కావలసినంత యూరియా పంపిణీ చేసి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తామని చెబుతున్న పాలక పక్షాలు దానిని అమలు చేయడంలో తమ చేతలలో నిరూపించుకోవడం లేదన్నారు. వట్టి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా రైతులకు సకాలంలో యూరియా అందించాలని అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎస్ మల్లేష్బి, రాములు, రైతులు వెంకటయ్య, చంద్రు, లింగమ్మ, రామచంద్రయ్య, అంజనమ్మ, గణేష్ నాయక్, లాలిబాయి, చిన్నిబాయి, వెంకటయ్య , సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES