Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరం

ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్నేహితుల గాజులు అనేది స్త్రీలు తమ స్నేహితులతో కలిసి గాజులను మార్చుకుంటూ, గోరింటాకు పెట్టుకుని, కలిసి భోజనాలు చేసుకుంటూ జరుపుకునే ఒక సాంఘిక సంబరాన్ని సూచిస్తుంది. ఈ సంబరాలు స్నేహబంధాలను పదిలం చేసుకుని, వాటిని ఒక దృఢమైన బంధంగా మార్చుకోవడం ఈ సంబరం ముఖ్య ఉద్దేశ్యం.  ఇది స్నేహం ఎప్పుడూ విడిపోని బంధం అని గుర్తు చేస్తుంది. నిజామాబాద్‌లోని బొబ్బిలి వీధి లో గల్లీ గణేష్ మండలి ప్రాంగణంలో ఈ సంబరాన్ని ఘనంగానిర్వహించుకున్నారు. 

అనంతరం ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరాన్ని చేసుకొని మురిసిపోయారు. మహిళలు కబడ్డీ, ఖో ఖో, దాండియా, డాన్స్ లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత,రంజిత, లత, స్వప్న, స్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజోల్, అక్షర, లావణ్య, అరుణ, కవిత, కమల  గల్లీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad