స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్లలో ప్రఖ్యాతిగాంచిన తూర్పు పడజాతి ఆవుల సంపదలు అభివృద్ధి చేసేందుకు 100 ఎకరాలలో తూర్పు పడ జాతి కాటిల్ బ్రీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. నల్లమల ప్రాంతంలో ఉన్నట్టువంటి తూర్పు పొడజాతి పశువుల సంరక్షణ, సంతాన ఉత్పత్తి కేంద్రం కొరకు అమ్రాబాద్ గ్రామంలో దాదాపు 100 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న అమ్రాబాద్ పొడ (తూర్పు పొడ) జాతి క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటుకు భూమిని పరిశీలించారు.
దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత గల తూర్పు పొడజాతి పశువులు కేవలం అమ్రాబాద్ నల్లమల ప్రాంతంలో ఉండటం నల్లమల ప్రాంత ప్రజల అదృష్టం, ఈ తూర్పు పొడజాతి పశువుల సంరక్షణ, సంతానం కొరకు అమ్రాబాద్ గ్రామంలో దాదాపు 100 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించి నల్లమల ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించాలని సహాయ శక్తుల ప్రయత్నిస్తానని తెలిపారు.