Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చెక్ డ్యామ్ లు మాకొద్దు..

చెక్ డ్యామ్ లు మాకొద్దు..

- Advertisement -

చెక్ డ్యామ్ లతో జీవితకాలం పంట నష్టం- రైతుల ఆవేదన
ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తా- సునీల్ కుమార్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని వాగుల్లో నిర్మించిన చెక్ డ్యామ్ లు మాకొద్దని, వాటిని తొలగించాలని కోరుతూ మోతె, అక్లూర్ రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలు కురిసి వాగుల్లో వరద వచ్చిన ప్రతిసారి పంటలకు నష్టం జరుగుతుందని, చెక్ డ్యామ్ వల్ల జీవితకాలం తాము పంటలను నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో వేల్పూర్ మండలం మోతె, అక్లూర్ గ్రామాల రైతులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మోతె, అక్లూర్ గ్రామాల పరిధిలో వాగులో నిర్మించిన చెక్ డ్యాంలను నిర్మూలించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చెక్ డ్యాంల వల్ల తాము జీవితకాల నష్టాన్ని చవిచూస్తున్నామని, చెక్ డ్యామ్ లో సరైన డిజైన్ లేకుండా, నాసిరకంగా నిర్మించడం ద్వారా వర్షాకాలం వచ్చిందంటే తమ పంటలే కాదు భూములు సైతం కొట్టుకుపోతున్నాయని వారు వాపోయారు. కప్పల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం వల్ల 2020 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతి వర్షాకాలం తమ పంటలు నాశనం అవుతున్నాయని, భూములు కోతకు గురవుతున్నాయని బాధపడ్డారు. చెక్ డ్యామ్ లు నిర్మించక ముందు ఈ సమస్య లేదన్నారు. 2020 సంవత్సరం తర్వాతనే ప్రతి వర్షాకాలం పంటలతో పాటు భూములు దెబ్బతింటున్నాయని తెలిపారు. చెక్ డ్యాంలు కొట్టుకపోయిన ప్రతిసారి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం శాశ్వత పరిష్కారం కాదని, వాటి నిర్మూలనతోనే తమకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొంటూ రైతులు ముత్యాల సునీల్ కుమార్ కు విన్నవించారు.

ముఖ్యమంత్రి మంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తా… సునీల్ కుమార్

వేల్పూర్ మండలంలో వాగుల్లో నిర్మించిన చెక్ డ్యాముల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్తానని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ తనను కలిసిన రైతులకు భరోసానిచ్చారు. రైతులు అధైర్యపడవద్దని, సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మోతె, అక్లూర్ గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad