Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తక్షణం రైతులకు సరిపడా యూరియాను అందించాలి: సీపీఐ(ఎం)

తక్షణం రైతులకు సరిపడా యూరియాను అందించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ డిమాండ్
నవతెలంగాణ – భువనగిరి

యూరియా కొరతను నివారించి తక్షణమే రైతులకు సరిపడు యూరియాను అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు ముందు రైతులకు సరిపడును అందించాలని ధర్నా నిర్వహించిన అనంతరం చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి నర్సింహ  మాట్లాడుతూ ప్రభుత్వాలు వానాకాలపు పంటకు ముందే వివిధ రకాల ఎరువులు అవసరాన్ని బట్టి తెప్పించుకొని ఎందుకు నిలువ చేసుకోలేదని ప్రశ్నించారు.

భువనగిరి మండలం, పట్టణంలో 28 వేల పైగా ఎకరాల భూమిలో 21 వేల ఎకరాల భూమిలో వరి, మిగతా 8 ఎకరాలలో పత్తి, కంది తోపాటు ఇతర పంటలకు సాగు చేసినారని ఈ సాగు చేసిన పంటలకు 2000 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే ఇప్పటికీ 1400 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందన్నారు. మిగతా యూరియా ఎప్పుడొస్తదో రైతుల బాధలు ఎప్పుడు తీరుతాయో అని అన్నారు. కేంద్రప్రభుత్వం నుండి యూరియా రాష్ట్రానికి తీసుకురావడంలో బిజెపి మంత్రులు, ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. షాపుల ముందు గంటల తరబడి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అందించవలసిన యూరియా ప్రైవేటు డీలర్లకు ఎట్లా అందిస్తున్నారని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు.

ప్రయివేటు డీలర్లు ఒక్కొక్క యూరియా బస్తా పైన రెండు లేదా మూడు వందల రూపాయలకు పైగా అదనంగా తీసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని, అధిక డబ్బులు తీసుకుంటున్న డీలర్లపై చర్యలు తీసుకోని, వారి లైసెన్సులు రద్దు చేయాలని, రైతులకు సరిపడు యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, సీపీఐ(ఎం) పట్టణ, మండల కార్యదర్శివర్గ సభ్యులు వనం రాజు, బందెల ఎల్లయ్య, కొండ అశోక్, కమిటీ సభ్యులు పర్వతి బాలకృష్ణ, వల్దాస్ అంజయ్య, బస్వాపురం గ్రామ శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, నందనం శాఖ కార్యదర్శి కొల్లూరి సిద్దిరాజు, నాయకులు కొత్త లక్ష్మయ్య, వల్దాసు వెంకటేష్, గాదే వెంకటేష్  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad