నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈగ రామకృష్ణ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ‘మేక్ యువర్ ఓన్ లాబొరేటరీ’ శిక్షణకు ఎంపికయ్యారు. ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో గల అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో కోనాపూర్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈగ రామకృష్ణ పాల్గొననున్నారు. నిజాంబాద్ జిల్లా నుండి మొత్తం 40 మంది ఉపాధ్యాయులు మేక్ యువర్ ఓన్ ల్యాబ్ శిక్షణకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు.
శిక్షణలో ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల కరికులంలోని 80 ప్రయోగాలు చేయడం నేర్చుకుంటారని, తద్వారా శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ఇంట్రాక్టివ్ లర్నింగ్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవడం ద్వారా భావి జీవితంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడతారని తెలిపారు. ఇప్పటివరకు ఆలస్య ఫౌండేషన్ ద్వారా మూడు లక్షల మంది ఉపాధ్యాయులు, రెండు కోట్ల మంది విద్యార్థులు జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితశాస్త్రం మొదలైన విషయాలలో శిక్షణ పొందినట్లు తెలిపారు. శిక్షణ అనంతరం అందరికీ మొబైల్ సైన్స్ కిట్ అందజేస్తారని ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ వివరించారు.
అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శిక్షణకు కోనాపూర్ ఉపాధ్యాయుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES