Saturday, May 10, 2025
Homeరాష్ట్రీయంఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే : ఎస్టీయూటీఎస్‌

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే : ఎస్టీయూటీఎస్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వంలో భాగమేనని ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్‌ తెలిపారు. వారి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనిమంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలను సమర్పించామని తెలిపారు. పాఠశాల విద్యలో కొంత మేర సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను నిర్వహించడమే కాకుండా నూతన ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిందని గుర్తు చేఊశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉచిత విద్యుత్‌ వంటి చర్యలున్నాయని వివరించారు. ఆర్థిక, సంక్షేమ సంబంధిత సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. పీఆర్సీ నివేదికను పొంది 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలనీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
సీఎం వ్యాఖ్యలు గర్హనీయం : పీఆర్టీయూ తెలంగాణ
ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక డబ్బుల్లేవని చేతులెత్తేయడం దురదృష్టకరమని తెలిపారు. బోనస్‌లు, కొత్త పథకాలను ప్రారంభించాలని తాము కోరడం లేదని పేర్కొన్నారు. న్యాయంగా తమకు రావాల్సిన డీఏలు, పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలంటూ అడుగు తున్నామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలకు మధ్య వైరాన్ని పెంచే ప్రయత్నం చేయడం సమంజసం కాదని సూచించారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘ నాయకులతో వెంటనే చర్చలు జరిపి సానుకూలంగా పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -