తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

– వైరా వ్యవసాయ మార్కెట్‌ ఎదుట రహదారిపై రైతులు నిరసన
– కొనుగోలు తీవ్ర జాప్యం వల్ల ధాన్యం,మొక్కజొన్న రైతులకు ఇక్కట్లు
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,
– కాంగ్రెస్‌ నాయకులు మాలోత్‌ రాందాస్‌ నాయక్‌
నవతెలంగాణ-వైరా
ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం వల్ల రైతులు ఇక్కట్లు పడుతున్నారని, శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంకు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసి పోయిందని, తడిసిన ధాన్యం, మొక్కజొన్న పంట ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్‌ ఎదుట రహదారిపైన రైతులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు మాలోత్‌ రాందాస్‌ మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం వలన రైతులు ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. 20 రోజుల తర్వాత కూడా ధాన్యం కాటాలు కావడం లేదని, మిల్లుల దయాదాక్ష్యం పైన ఆధారపడి ధాన్యం కొనుగోలు జరుగుతుందని అన్నారు. ఎండలు తీవ్రత మూలంగా తేమశాతం చాలా తక్కువ నమోదు అవుతున్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం వర్షంకు తడిసినా అధికారులు కనీసం మార్కెట్‌ కు రాలేదని, అధికారులు హామీ ఇచ్చే వరకు రైతులు ఉద్యమం చేస్తామని రాస్తారోకో నిర్వహించడంతో మార్కెట్‌ చైర్మన్‌ రత్నం రైతులు ఆందోళన వద్దకు చేరుకుని రైతులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. వైరా శాసనసభ్యులు రాములు నాయక్‌ దృష్టికి సమస్యలు వివరించారు. జిల్లా అధికారులతో మాట్లాడి తడిసి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచ్‌ పారుపల్లి కృష్ణారావు, రైతు సంఘం పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు, నల్లమోతు వెంకటనారాయణ, పైడిపల్లి సాంబశివరావు, వడ్లమూడి మధు, కామినేని రవి, చిత్తారు మురళి, పుచ్చకాయల రామయ్య, కాంగ్రెస్‌ నాయకులు శీలం వెంకట నర్సిరెడ్డి, పాలేపు నరసింహారావు, చపిడి వెంకటేశ్వరరావు, పమ్మి అశోక్‌, రైతులు సైదులు, శ్రీనివాసరావు, మల్లికార్జున్‌, వెంకట్‌, ఉసెన్‌, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన తాతా భాస్కర్‌ రావు
తల్లాడ : తల్లాడ మండలం కల కుడిమ గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు తాతా భాస్కర్‌రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేషరతుగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంజనాపురం ఉపసర్పంచ్‌ కృష్ణయ్య, ఆదూరి జీవరత్నం, పాపకంటి లాజయ్ ముత్తయ్య, వడ్డే రమేష్‌, ఆదర్శ వెంకటి రైతులు పాల్గొన్నారు.

Spread the love