– ఎంపీపీ శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 15 నుండి నిర్వహించే సీఎం కెసీఆర్ గారి కప్ టోర్నమెంట్ ఆటల పోటీలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి మండల యువకులకు పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో శుక్రవారం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరున సీఎం కప్ టోర్నమెంట్ ఆటల పోటీలను ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో, 22 నుండి 24 వరకు జిల్లా స్థాయి లో నిర్వహిస్తున్నారని, మండల స్థాయిలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఫుట్ బాల్, కోకో, వాలీబాల్, పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆసక్తి గల 15 నుండి 36 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ ఆటల పోటీల లో పాల్గొనేందుకు ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇచ్చిన నెంబర్లను ఫోన్ చేసి సంప్రదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ శ్రీనివాస రావు, తహశీల్ధార్ రూథర్ విల్సన్, ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ రాజేష్ కుమార్, సీ.ఆర్.పీ ప్రభాకర చార్యులు, ఎం.ఆర్.సి కంప్యూటర్ ఆపరేటర్ మహబూబ్, నాయకులు మందపాటి రాజ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటీల్లో పాల్గొనే వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ లు:
ప్రభాకర చార్యులు – 9491357842
మహబూబ్ – 9492315335