ఈవీఎంల గోదాం తనిఖీ…

Ashwarapeta– సంచార వాహనాలు ప్రారంభం…
– సంచార వాహనాలు ద్వారా ఈ.వీ.ఎం ఓటింగ్ పై విస్తృత ప్రచారం…
– కలెక్టర్,ఎన్నికల నిర్వహణ జిల్లా అధికారిణి ప్రియాంక అల
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటుహక్కు వినియోగంపై ఓటరుకు అవగాహన కల్పించేందుకు మొబైల్ వాహనాల ఏర్పాటు ద్వారా నమూనా ఓటింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో ఈవీఎంలు గోదాము ను తనిఖీ చేశారు. అనంతరం ఓటుహక్కు వినియోగంపై అవగాహన కు ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలను జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఐదు మొబైల్ వాహనాల ద్వారా  నమూనా ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రతి ఓటరు. ఈవీఎంలు ద్వారా  ఓటుహక్కు వినియోగంపై అవగాహన పొందాలని సూచించారు.రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో  ఈవీఎంలు ( ఫస్ట్ లెవెల్ చెకింగ్) ప్రాథమిక తనిఖీ పూర్తి చేసామని అన్నారు. 24 ఈవీఎం  యూనిట్స్ ద్వారా అన్ని మండలాలకు పంపుతున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగం తదుపరి వివి ఫ్యాట్ స్లిప్పులు భద్ర పరచాలని చెప్పారు.నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల తో పాటు,జిల్లాలోని అన్ని మండలాల్లో ఐదు మొబైల్ వాహనాలు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ఆయా మండలాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో మొబైల్ వాహన సంచారపు షెడ్యూల్ ప్రకటిస్తామని వివరించారు. ఐ.డి.ఓ.సి ఇతర కార్యాలయాల్లో సైతం ఓటర్లకు అవగాహన నిమిత్తం ఈ.వీ.ఎం యూనిట్స్ ప్రదర్శనకు ఉంచుతామని కలెక్టర్ వెల్లడించారు. అంతకు ముందు ఈ.వీ.ఎం ల గోదాం సీల్, సి సి కెమెరాలు పని తీరును పరిశీలించి తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు.కలెక్టర్ తో పాటు రెవిన్యూ విభాగం అదనపు కలెక్టర్  రాంబాబు,స్థానిక సంస్థల విభాగం అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, తహసీల్దార్ లు శర్మ,నాగరాజు,కృష్ణ ప్రసాద్,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సురేష్,గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్ అగర్వాల్ (భాజపా), బాలాజీ(సీపీఐఎం), ఎర్రా కామేష్ (బీఎస్పీ), అన్వర్(భారస), సతీష్ కుమార్(కాంగ్రెస్) లు పాల్గొన్నారు.
Spread the love