– తహశీల్దార్ లూదర్ విల్సన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం జాతీయ ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ఓటరు నమోదు పై సమీక్ష నిర్వహిస్తామని స్థానిక తహశీల్దార్ లూదర్ విల్సన్ అన్నారు. తన కార్యాలయం శుక్రవారం రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ వారం లో దరఖాస్తులు ఎన్ని వచ్చాయి,ఎన్ని ఆమోదం పొందాయి?అభ్యంతరాలు ఏమిటి అనే అంశాలను వివరించారు. ఈ నెల 6 నుండి 12 వరకు ఫాం 8 దరఖాస్తులు 21 వచ్చాయని,ఇందులో 14 దరఖాస్తులు ఆమోదం పొందాయని తెలిపారు. ఈ సమావేశంలో డి.టి సుచిత్ర, సీపీఐ(యం) మండల కార్యదర్శి బొంబాయి చిరంజీవి,సీపీఐ నాయకులు రఫీ,సత్యనారాయణ,బీఆర్ఎస్,తెదేపా నాయకులు పాల్గొన్నారు.